రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ సవాల్‌

హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఖచ్చితంగా గెలుస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్‌ ఉప ఎన్నికలో డిపాజిట్‌ తెచ్చుకోవాలని సవాల్ చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. ఈటల రాజేందర్ కోసమే కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. త్వరలో ఈటలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారన్నారు. రేవంత్‌రెడ్డి చిలకజోస్యం చెప్పుకుంటే మంచిదన్నారు. కాంగ్రెస్‌లో భట్టిది నడవట్లేదని.. అక్రమార్కులదే నడుస్తోందన్నారు. వివేక్‌ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారని తెలుస్తోందని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.