బోగస్‌ బాబు.. బోగస్‌ సర్వేలు.. చంద్రబాబుపై మంత్రి రోజా విమర్శలు

మంత్రి రోజా చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశారు. బోగస్‌ సర్వేలు చేయించే చంద్రబాబుని అందరు బోగస్‌ బాబుగా పిలుస్తున్నారన్నారు. పది రోజులకి ముందు సిఎం అయినా మహారాష్ట్ర సిఎంకు టాప్‌ 5 ర్యాంకు, మూడు సంవత్సరాలుగా అన్ని పథకాలను అమలు చేస్తున్న సిఎం వైఎస్‌ జగన్‌కి అట్టడుగు ర్యాంకు ఇవ్వడంపై రోజా మండిపడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్‌కి చిన్న మెదడు చిట్లిపోయిందని, త్వరలోనే మానసిక వైకల్య కేంద్రంలో చంద్రబాబు చేర్పించాలని అన్నారు. ఓవైపు కాంగ్రెస్‌కు మద్దతిస్తూనే.. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి అభ్యర్థికి మద్దతివ్వడం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శం అన్నారు.