జగనన్న కటౌట్ చూస్తేనే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయి

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కటౌట్ చూస్తేనే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయ‌ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్‌కే. రోజా అన్నారు. ప్లీన‌రీ స‌మావేశాల్లో రోజా మాట్లాడారు. ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు. ప్రజలు మెచ్చిన నాయకుడు, విధికి కూడా తలవంచని వాడు, తలెత్తుకుని తిరిగే వీరుడు మన జగనన్న, అలాంటి జగనన్న కన్న విజయమ్మ గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను.