చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని భేటీ

ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జునతో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో ఈ భేటీ జరిగింది. సినిమారంగం అభివృద్ధి, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చిరంజీవి, నాగార్జునలతో చర్చించారు.