ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతెరా వేదికగా సాగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ ఆద్యంతం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తుతూ ప్రసంగం కొనసాగించారు. నమస్తే అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్ దేశం కోసం మోదీ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రశంసల్లో ముంచెత్తారు. భారత్- అమెరికాలు 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని ప్రకటించారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని అంటూ అమెరికా భారత్‌ను అభిమానిస్తుందని అన్నారు. ట్రంప్ ఇంకా ఏమన్నారంటే…‘ భారత్, అమెరికా ఎప్పటికీ నమ్మదగ్గ స్నేహితులు..లక్ష మందికి పైగా ఇక్కడికి రావడం ముదావహం. భారత్ ఆతిథ్యాన్ని ఎన్నటికీ మరిచిపోలేం..ఈ పర్యటన మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిఉంటుంది. ఓ ఛాయ్ వాలా స్ధాయి నుంచి మోదీ ప్రధానిగా ఎదిగిన తీరు అద్భుతం..ఇంతటి విశాల దేశాన్ని మోదీ అద్భుతంగా నడిపిస్తున్నారు. అత్యంత విజయవంతమైన ప్రధానుల్లో మోదీ ఒకరు. భారతీయులు ఏదైనా సాదించగలరనేందుకు మోదీ నిదర్శనం.

మోడీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్