సీఎంలతో ముగిసిన ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

సీఎంలతో ముగిసిన ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది.  కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు,కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటంతోపాటు లాక్‌డౌన్‌ సడలింపులపై ఎలా ముందుకు వెళ్లాలి? లాక్‌డౌన్‌ను పొడిగించాలా? లేక దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలా? తదితర విషయాలపై ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించారు.  మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ ఉండాల్సిందేనని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు. రెడ్‌జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగించాలని,  గ్రీన్‌జోన్లలో పూర్తి సడలింపు ఇవ్వాలని కొంతమంది సీఎంలు కోరారు.  వలసకూలీలకు అందుతున్నసాయంపైనా మోదీ ఆరా తీశారు.