తెలుగు బుల్లితెర పరిశ్రమలో విషాదం..

తెలుగు బుల్లితెర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటుడు పవిత్రనాథ్‌ కన్నుమూశారు. చక్రవాకం, మొగలిరేకులు, కృష్ణ తులిసి.. లాంటి పలు సీరియల్స్ తో బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్ తక్కువ ఏజ్ లోనే మరణించడు.

అయితే ఈ విషయాన్ని సీరియల్ నటుడు ఇంద్రనీల్, అతని భార్య మేఘన సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. పవి.. ఈ బాధని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైనవాడివి. నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం, నిన్ను చాలా మిస్ అవుతున్నాం, చివరి చూపు కూడా చూడలేదు, నీ ఆత్మకు శాంతి చేకూరాలిని,ఆ భగవంతుడు నీ కుటుంబానికి మరింత శక్తినివ్వాలి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు అసలు ఏమైంది, ఎలా చనిపోయాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.