అశోక్‌ గజపతిరాజు జైలుకెళ్లడం ఖాయం

అశోక్‌ గజపతిరాజుపై వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాన్సాస్‌ ట్రస్ట్‌లో వందల ఎకరాలు కాజేసిన దొంగ అశోక్‌ గజపతిరాజు అంటూ ఆరోపించారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అశోక్‌ గజపతిరాజుపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందన్నారు. అశోక్‌ గజపతిరాజు జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌, సింహాచలం చైర్మన్‌ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని వెల్లడించారు. అశోక్‌ గజపతిరాజు విజయనగరం జిల్లాకు రాజులా ఫీలవుతున్నారన్నారు.