కల్కి లో మరో హీరోయిన్ ఎంట్రీ….

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణే జంటగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ రూపుదిద్దుకుంటుంది. అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ కోసం దీపికా పదుకొణె భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు టాక్ . ప్రస్తుతం చిత్ర వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. దీపికా సుమారు రూ.20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమా కనుక ఈమె అంతగా డిమాండ్ చేస్తుందని వినికిడి. మరి నిజంగానే దీపికా పదుకొణే అంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందా ? ప్రస్తుతం దీపికా పదుకొణేకి ఫుల్ డిమాండ్ ఉంది. పైగా ఒకేసారి దీపికాకి మూడు భారీ ప్రాజెక్టులు చేతిలో ఉండటంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక కల్కిలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కూడా నటిస్తున్నారు. అలాగే, ఈ హిందూ మైథలాజి బ్యాక్ డ్రాప్‌తో రానున్న ఈ సినిమా పై మరో ఇంట్రెస్టింగ్ అప్‌డెట్ కూడా అందుతోంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కూడా నటించనుందట. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో ‘రాధ’ పాత్రతో కనిపించబోతున్నారని టాక్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నట్టు మరో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఇందులో నటిస్తున్నాడట. మరి ఈ సినిమాలో దుల్కర్ నటిస్తే.. మలయాళంలో కూడా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయి.