మృణాల్ చేసిన ఈ పనికి తెలుగు ఫ్యాన్స్ ఫిదా..

బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో సూపర్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. సీతారామంతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన మృణాల్.. ఇక్కడి వారి గుండెల్లో సీతగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్నలో యష్ణగా మరోసారి తెలుగు అబ్బాయిల మనసు దోచుకున్నారు. ఇప్పుడు మరోసారి తెలుగు కుర్రాళ్ళ గుండె కొల్లగొట్టడానికి ఫ్యామిలీ స్టార్ తో ఇందుగా రాబోతుంది. గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ప్రమోషన్స్ లో మృణాల్ చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అందుకు కారణం తెలుగు ఆడియన్స్ తన పై చూపుతున్న ప్రేమ. నేడు ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి మృణాల్ తన ఫ్యామిలీని కూడా తీసుకు వచ్చారు. తనకి ఇక్కడ ఉన్న అభిమానాన్ని చూపించారు.

ఇక తన పై ఇంతటి అభిమానం చూపుతున్న తెలుగు అభిమానులకు కృతజ్ఞతగా ఒకటే చెప్పాలనుకుంటున్నాను అంటూ.. స్టేజి పై నుంచి తెలుగు ఆడియన్స్‌కి పాదాభివందనం చేసింది. మృణాల్ చేసిన ఈ పని తెలుగు ఫ్యాన్స్ మరింత ఫిదా అయ్యిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాలో మృణాల్ ఇందు అనే పాత్ర చేస్తున్నారు. ఈ పాత్ర కూడా తన మునపటి పాత్రలులా అభిమానుల గుండెలను దోచుకుంటుందని చెప్యారు. కాగా ఈ మూవీ ఏప్రిల్ 5న తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ చేయబోతున్నారు.