మృణాల్.. మరో హిట్టోస్తే రెమ్యునరేషన్ ఎంత పెరుగుతుందో?

టాలీవుడ్ సీతగా మంచి గుర్తింపు అందుకున్న మృణాల్ ఠాకూర్ మరో రెండు రోజుల్లో ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ . ఫస్ట్ మూవీతోనే తనదైన గుర్తింపు సంపాదించుకుంది. సీతగా తన అందంతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. తెలుగులో ఆమె చేసిన తొలి రెండు మూవీలు సీతారామం, హాయ్ నాన్న థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా హిట్లు అయ్యాయి. సినిమాలో హీరోయిన్ రోల్ కు మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్టులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న మృణాల్.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో సందడి చేయనుంది. టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయింది. సీతారామం వరకు అమ్మడి రెమ్యునరేషన్ కోటి కంటే తక్కువే ఉండేది. ఆ తరువాత హాయ్ నాన్న హిట్టుతో లెక్క కోటి దాటింది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ హిట్టయితే ఆమె రెమ్యునరేషన్ రేటు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తెలుగులో వరుసగా హిట్లు కొడుతుండడంతో ఆమెను లక్కీ గర్ల్ అని పిలవడం ప్రారంభించారు సినీ ప్రియులు.

https://www.tupaki.com/entertainment/mrunalthakurremunerationincreases-1352931