పవన్ ది పిరికితనం, చేతకానితనం : ముద్రగడ విమర్శలు

వైసీపీలో చేరినప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాపు నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ ను ముద్రగడ మరోసారి టార్గెట్ చేశారు. పార్టీ కార్యకర్తలను పవన్ కనీసం దగ్గరకు కూడా రానివ్వరని ఆయన అన్నారు. పవన్ చుట్టూ ఎప్పుడూ బౌన్సర్లు ఉంటారని… రోజుకు మూడు షిఫ్టుల్లో బౌన్సర్లు పని చేస్తారని చెప్పారు. అలాంటి పవన్ వైసీపీ నేతలను బ్లేడ్ బ్యాచ్ అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అని అన్నారు. పిరికితనం, చేతకానితనంతోనే పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు పవన్ జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం కారణంగా ఆయన తన ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్ కు వచ్చారు.