వైసీపీలోకి ముద్రగడ…?

కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనను పిఠాపురం నుంచి బరిలో దింపే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదంటే ముద్రగడ కుటుంబం నుంచి ఎవరైనా ఒకరు పోటీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ముద్రగడను పార్టీలోకి చేర్చుకుని పిఠాపురం నుంచి పోటీకి దింపేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోందని ప్రచారం సాగుతోంది.

మరోవైపు పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై ముద్రగడను పోటీలో నిలపాలని అధికార పార్టీ వైసీపీ భావిస్తోందని సమాచారం.దీంతో పిఠాపురం నియోజకవర్గంలోని రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.