వంద బిలియన్‌ డాలర్ల జాబితాకి చేరువలో ముఖేష్‌ అంబానీ

ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రస్తుతం 12 స్థానంలో ఉన్న రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ మరో అరుదైన ఫీట్‌ను సాధించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌ ప్రకారం..ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న వారెన్ బఫెట్ తరువాత స్థానంలో నిలిచారు.   
  
శుక్రవారం ఒక్కరోజే ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో రియలన్స్‌ షేర్‌ వ్యాల్యూ 4 శాతం పెరిగి..అంబానీ సంపాదనకు మరో 3.7 బిలియన్ల డాలర్లు చేరినట్లైంది. దీంతో 92.9 బిలియన్‌ డాలర్లతో వరల్డ్‌ వైడ్‌ బిలియనీర్‌ జాబితాలో 11వ స్థానంలో ప్రముఖ కాస్మోటిక్స్‌ సంస్థ లోరియల్‌ వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయరన్‌ను వెనక్కి నెట్టారు.  92.60 బిలియన్ డాలర్లతో ముఖేష్‌ అంబానీ ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. అపర కుబేరుడు వారెన్‌ బఫెట్‌ 103 బిలియన్‌ డాలర్లతో 10వస్థానంలో ఉన్నారు.