హీరోయిన్లంటే అందాలను ఎరవేసే ఫొటోల్లోనే కాదు.. ఇలా కాస్త వైవిధ్యం చూపే ప్రయత్నం కూడా చేయవచ్చు అని నభా నటేష్ నిరూపించారు. ఈ ప్రపంచంలోని చాలా మంది నటులకు కనీసం ఒక్కసారైనా చాప్లిన్ స్టైల్లో కనిపించడం ఆసక్తిదాయకమైన విషయం. తెలుగులో అయితే.. పెద్ద పెద్ద స్టార్లు కూడా కనీసం ఒక్క ఫ్రేమ్ లో అయినా చాప్లిన్ గెటప్ వేసిన వాళ్లే! సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలాంటి వాళ్లు కూడా ఉన్నారు. మరి అలాంటి ప్రయత్నమే చేసింది నటి నభా నటేష్. చాప్లిన్ డ్రస్ లో ఆయనను అనుకరిస్తూ ఒక సరదా ప్రయత్నం చేసింది. వీటిని సోషల్మీడియాలో పోస్ట్ చేసింది.
