సమంత ఇంటి సెంటిమెంట్‌తో నాగ చైతన్య ఇల్లు కొనేసింది!

నాగచైతన్య, సమంత విడిపోకముందు ఓ ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. దాన్ని కొంత రీమోడల్‌ చేస్తుండగానే ఇద్దరిమధ్య స్పర్థలు వచ్చి విడిపోయారు. గచ్చిబౌలిలోని ఫైనాన్సియల్‌ జిల్లాకు దగ్గరలో ఉన్న మురళీమోహన్‌కు చెందిన ఖరీదైన విల్లాను వారు కొనుగోలు చేశారు. ఆ తర్వాత దానిని వేరేవారికి అమ్మేశారు. అది కూడా మురళీమోహన్‌ మధ్యవర్తిత్వంతో జరిగింది.ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్యూలో మురళీమోహన్‌ వెల్లడించారు. అయితే ట్విస్ట్‌ ఏమంటే, ఇప్పుడు ఆ ఇంటిని తిరిగి తమకు కావాలని సమంత తిరిగి మురళీమోహన్‌ దగ్గరకు వెళ్ళడం జరిగింది. దాంతో ఆయన కుదరదని చెప్పినా, సమంత ఇంటిమెంట్‌తో మురళీమోహన్‌ను అభ్యర్థించింది. దాంతో ఆయన మరలా అమ్మేసిన వారితో మాట్లాడడంతో వారు రేటు పెంచడంతో అమ్మినదానికంటే రెండు కోట్లు ఎక్కవ పెట్టి కొనుగోలు చేసి తన తల్లితో ఉంటుంది.