నాగ చైతన్య హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాట. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు పెట్టిన దర్శకనిర్మాతలు నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, రష్మికకు డైరెక్టర్ పరశురామ్ కథ వినిపించారా? లేదా? అన్నది స్పష్టత లేదు. ఒకవేళ ఇది ఓకే అయితే నాగ చైతన్య, రష్మిక మందన్నా తొలిసారిగా జోడి కట్టిన చిత్రం ఇదే అవుతుంది. కాగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ‘గీత గోవిందం’లో రష్మిక హీరోయిన్గా చేసిన విషయం తెలిసిందే.
