నాగచైతన్య బాలీవుడ్‌ చిత్రం

గురువారం నుంచి నాగచైతన్య హిందీ సంభాషణలు పలుకుతున్నారు. అలాగే యుద్ధం కూడా చేస్తున్నారు. హిందీ చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’ కోసమే ఇదంతా. ఇందులో చైతూ స్పెషల్‌ రోల్‌ చేస్తున్నారు. ఆమిర్‌ ఖాన్‌ లీడ్‌ రోల్‌లో హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. లాల్‌సింగ్‌ చద్దా (ఆమిర్‌ పాత్ర పేరు) ఆర్మీలో ఉన్నప్పుడు అతని స్నేహితుడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలిసింది.