వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం..!

బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అలానే అభివృద్ధిని ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించాలి అని అన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, సులభంగా గెలుస్తాంలే అని ధీమాను విడిచి పెట్టి కష్టపడి పనిచేయాలి అని ఆయన అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడం ఖాయం అన్నారు. కొన్ని ప్రాంతాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మధ్య ఉన్న విభేదాలు విడిచి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. టీడీపీ జనసేన పొత్తు కుదిరితే 117 సీట్లు పొత్తు కుదరకపోతే 132 సీట్లు గెలవబోతున్నాం అన్నారు.