శ్రీకృష్ణుని ఎనిమిది మంది భార్యలు ఎవరో తెలుసా ?

శ్రీకృష్ణుడు.. గోపీలోలుడుడా సాక్షాత్తు అవతారం. ఆ మానసచోరుడు, వేణుగాణలోలుడు, మాధవుడు… మానవ రూపంలో భూమిమీద నడియాడిన అవతారం శ్రీకృష్ణావతారం. బృందావనంలో గోపాలుని చేరాలని పరుగులు తీయని గోపిక వెదికిన కనపడదేమో..ఆ కమనీయ రూపుని కనులార చూడాలని ప్రతిదినం బృందావని చేరే గోపికలలో శ్రీకృష్ణుని అత్యంత ఇష్టసఖి రాధ. రాధతో పాటు కృష్టుణికిష్టమైన మరో ఎనిమిది మంది సఖులున్నారు.

వారంటే గోవిందునికి ఎంతో ప్రీతి. రాధేయుడి అష్ట సఖులు లలిత, విశాఖ, చిత్ర, ఇందులేఖ, చంపకలత, రంగదేవి, తుంగవిద్య, సుదేవిలు అష్టసఖులు. మధురలో వీరికి మందిరం వుంది. వీరే కాక గోవిందుడికి పదహారు వేల మంది గోపికలుండేవారట. వీరి ఆటపాటలతో బృందావనం ఆనందనందనంగా వెలుగొందినదని పురాణ కథనం. ఆ గోవిందుడు అలా గోపికలందరివాడై ప్రేమామృతాలను పంచాడు. ఆ స్వామిని అత్యంత భక్తి ప్రపత్తులతో స్వామి మనసును గెల్చుకున్న నిజమైన భక్తుల వరుసలలో ఈ ఎనిమిది మంది ఉన్నారని పెద్దలు చెప్తారు.