టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఫ్యామిలీ ప్రతి ఏటా వినాయక చవితి పండగను ఘనంగా జరుపుకుంటుంది. ఇంట్లో గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టించి నిష్టగా పూజలు చేస్తారు. అయితే ఈ సారి పర్యావరణ సహిత వినాయకుడిని ఇంటికి తెచ్చుకున్నారు ఘట్టమనేని ఫ్యామిలీ. ఘనంగా పూజలు నిర్వహించడమే కాదు.. నిమజ్జనం కూడా అలాగే చేశారు.మట్టి గణేషుడిని ఇంట్లోని తొట్టిలో నిమజ్జనం చేయగా, ఆ కార్యక్రమంలో మహేశ్, నమ్రత, సితార, గౌతమ్ పాల్గొన్నారు.
