బోయపాటి సినిమాలో బాలయ్య విలన్

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గత రెండు చిత్రాల్లో బాలకృష్ణను సరికొత్త అవతారాల్లో చూపించిన బోయపాటి.. ఈ సినిమాలోనూ డిఫరెంట్ షేడ్స్‌లో ఆయన్ని ఆవిష్కరిస్తున్నారని ఇప్పటికే వార్తలు బయటికి వచ్చాయి. ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నారని, అంతేకాకుండా మెయిన్ విలన్‌గా ఆయనే నటిస్తున్నారని ఈమధ్య రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే, బాలయ్య విలన్‌ పాత్ర పోషిస్తున్నట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఈ సినిమాకు సంబంధించిన వ్యక్తుల ద్వారా తెలిసింది. బాలకృష్ణ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ చేయడం లేదని వారు స్పష్టం చేశారు. అయితే, ఆయన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట. మొదట ఆయన పాత్రను నెగిటివ్‌గా చూపించి ఆ తర్వాత అలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో రివీల్ చేస్తారట. అంతేకానీ, ఇది విలన్ రోల్ కాదని సమాచారం. బోయపాటి తనదైన శైలిలో ఈ సినిమాలో ట్విస్టులను జోడిస్తున్నారట. బాలయ్యను గతంలో చూడని విధంగా ఆవిష్కరిస్తున్నారట.