పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన శివానందరెడ్డి

నంద్యాల పార్లమెంట్ TDP ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి తెలంగాణ పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు. భూవివాదం కేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులోని ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు. అరెస్ట్ వారెంట్ చూపాలని శివానందరెడ్డి కోరగా పోలీసులు నోటీసులు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుని ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి కారులో పారిపోయారు.