నాని నిర్మాణంలో ‘మీట్‌ క్యూట్‌’

వాల్‌ పోస్టర్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై హీరో నాని నిర్మించిన అ, హిట్‌ వంటి సినిమాలు సూపర్‌ హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా నాని నిర్మాణంలో మీట్‌ క్యూట్‌ అనే సినిమా రూపొందుతుంది. ఈ విషయాన్ని నాని ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘నేడు కొత్త ప్రయాణం మొదలైంది. ఇది నాకెంతో ప్రత్యేకం..’ అంటూ మీట్‌ క్యూట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశాడు. ఈ సినిమాలో సత్యరాజ్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.