కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్న ఒక అంశానికి మోదీ సర్కార్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగనుంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా పెన్షన్ రూల్స్‌ను మార్చింది. ఉద్యోగులకు రెండు ఆప్షన్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎన్‌పీఎస్ నుంచి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్‌కు మారేందుకు అనుమతినిచ్చింది. అదేసమయంలో ఈ ఆప్షన్ వద్దనుకుంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లోనే కొనసాగే వెసులుబాటు కల్పించింది.
మోదీ సర్కార్ తాజా నిర్ణయం అందరికీ వర్తించదు. కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది. 2004 జనవరి 1వ తేదీ లోపు ఉద్యోగం కన్ఫార్మ్ అయినా లేదా సర్వీస్‌లో చేరిన వారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. 2004 జనవరి 1 లేదా ఆపైన ఉద్యోగంలో చేరిన వారికి మారే ఆప్షన్ ఉండదు.