దక్షిణాది లేడి సూపర్ స్టార్‌గా పేరొందిన నయనతార, ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. నయనతార ప్రస్తుతం ‘నెత్రికన్’ సినిమాలో నటిస్తోంది. రిలీజ్‌కి సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్‌లో తాజాగా నయనతార పాల్గొంది. ఈ సందర్భంగా నయనతార ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమకు నిశ్చితార్థమైందని సిగ్గు పడుతూ తన వేలికి ఉన్న ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని చూపించింది. ఇక పనిలో పనిగా తనకు కాబోయే భర్తపై పొగడ్తల వర్షం కురిపిస్తూ.. ‘విఘ్నేశ్ మనసు చాలా మంచిది, తను ఎంతో మంచి వ్యక్తి. తనతో ఉంటే నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను’ అంటూ మొత్తానికి నయనతార తన లేటెస్ట్ ప్రేమ వ్యవహారంపై వివరణ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నవంబర్‌లో వీరి పెళ్లి ఉంటుందట.