‘ఆహా’లో నయనతార ‘నీడ’

తమిళంలో విడుదలైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘నిజల్‌’ మూవీకి తెలుగానువాదం ‘నీడ’. ఈ సినిమా జులై 23న ఆహాలో స్ట్రీమింగ్‌ కాబోతోంది. నయనతార, కుంచాకో బోబన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, అప్పు ఎన్‌.భట్టతిరై ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. నితిన్‌ అనే చిన్నారి సాయంతో జాన్‌ అనే న్యాయమూర్తి ఒక హత్య కేసును ఎలా చేధించాడు? అనేది ఈ సినిమా కథాంశం.