ఎపిలో కొనసాగుతున్న కరోనా ఉధృతి

ఎపిలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజూ 10 వేలకుపైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం ఒక్కరోజే 11,303 కేసులు నమోదు కాగా.. నేడు 12 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 98,048 నమూనాలను పరీక్షించగా.. 12,768 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 15,612 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం కరోనా నుంచి ఇప్పటి వరకు 15,62,229 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 98 మంది మృతిచెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది మృతిచెందగా.. ఆ తరువాత నెల్లూరు జిల్లాలో 10, పశ్చిమ గోదావరి జిల్లాలో 9, అనంతపురం జిల్లాలో 8, తూర్పు గోదావరి జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో 8, గుంటూరు జిల్లాలో 7, ప్రకాశం జిల్లాలో 7, విశాఖపట్నం జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 5, కడప జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో నలుగురు మృతిచెందారు.