నైజీరియాలో ట్విట్టర్‌పై నిషేధం

ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా సంస్థలపై ఆంక్షలు మొదలయ్యాయి. వీటిలోని కంటెంట్‌ను కట్టడి చేసేందుకు భారత్‌ ఐటి నూతన నిబంధనలు తీసుకోవస్తే… నైజీరియా ఏకంగా నిషేధాన్ని విధించింది. ట్విట్టర్‌ను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. నైజీరియా అధ్యక్షుడు మహ్మద్‌ బుహరీ చేసిన ట్వీట్‌ను తొలగించిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆగేయ ప్రాంతంలో నివసిస్తున్న కొంత మందిని ఉగ్రవాదులుగా భావిస్తున్నానంటూ… వేర్పాటువాద ఉద్యమాన్ని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ఇది వివాదాస్పదమవ్వడంతో ఆ ట్వీట్‌ను ట్విట్టర్‌ తొలగించింది. ఈ చర్యపై మండిపడ్డ నైజీరియా సమాచార శాఖ మంత్రి లాయి మహ్మద్‌… కార్పొరేట్‌ ఉనికిని అణగదొక్కగల సామర్థ్యం కోసం దీన్ని వినియోగిస్తున్నందున… నిరవధికంగా బ్యాన్‌ చేస్తున్నామని ప్రకటించారు. కాగా, ఈ ప్రకటన వెలువడిన తర్వాత శుక్రవారం ట్విట్టర్‌ పనిచేయగా… దీనిపై ఓ అధికారి స్పందిస్తూ… సాంకేతికతకు సంబంధించిన సమాధానాలను చెప్పలేనని, కానీ నిరవధికంగా ట్విట్టర్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.