18 ఏళ్ల తర్వాత బ్లాక్‌బస్టర్ సినిమా రీమేక్..

18 ఏళ్ల తర్వాత బ్లాక్‌బస్టర్ సినిమా రీమేక్..

‘ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని’.. ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తూనే ఉంటుంది. 18 ఏళ్ల క్రితం నితిన్, సదా జంటగా నటించిన ‘జయం’ సినిమా ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. తేజ డైరెక్షన్‌లో ఆర్పీ పట్నాయక్ సంగీతంతో అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేసింది. ఇప్పటికీ ఈ సినిమాకు, పాటలకు మంచి ఆదరణ ఉంది. తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఏడాదికే తమిళంలో రీమేక్ చేశారు. తమిళంలో రవి, సదా జంటగా నటించారు. అక్కడ కూడా సినిమా హిట్టే. దాంతో తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడంతో రవి తన పేరు ముందు జయం అన్న పేరును యాడ్ చేసుకున్నారు.

ఈ సంగతి అటుంచితే.. ఈ సినిమాను మళ్లీ రీమేక్ చేయబోతున్నారట. తెలుగు, తమిళంలో మంచి హిట్ అందుకున్నప్పుడు కన్నడలోనూ కచ్చితంగా హిట్ అవుతుందని భావించి కన్నడలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఓ కుర్ర హీరో. ప్రవీణ్ అనే కుర్ర నటుడు ‘జయం’ సినిమాను కన్నడలో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ప్రవీణ్ ఓ డాక్టర్. కానీ యాక్టింగ్‌ అంటే ప్రాణం. అందుకే దాదాపు ఏడాది పాటు నటనలో శిక్షణ తీసుకుని ‘జయం’ రీమేక్‌తో కన్నడ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అవ్వాలని నిర్ణయించుకున్నాడు. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట.