సీరియల్స్‌లో ఎంట్రీ ఇస్తున్న నితిన్‌

హీరో నితిన్‌ సీరియల్స్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. హీరో అయి ఉండి.. సీరియల్స్‌లో ఎంట్రీనా అని ఆశ్చర్యపోకండి. అదంతా సినిమా ప్రమోషన్స్‌ కోసమేనట. తాజాగా నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇందులో నితిన్‌కి జోడీగా.. కృతిశెట్టి, కేథరిన్‌ ట్రెస్సా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగానే.. నితిన్‌ ఓ పాపులరర్‌ సీరియల్‌లో అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఏ సిరియల్‌లో కేమియో రోల్స్‌ చేస్తారనేదానిపై క్లారిటీ లేదు. కానీ ఈ వార్త నెట్టింట్లో వైరల్‌ అవ్వడంతో నితిన్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.