దర్శకురాలిగా నివేథా థామస్‌

తెలుగు, తమిళ చిత్రాలలో టాలెంటెడ్ హీరోయిన్‌గా పాపులారిటీని తెచ్చుకుంది నివేథా థామస్. ఈమెకి డైరెక్షన్ అంటే చాలా ఇష్టమని ఫ్యూచర్‌లో తప్పకుండా డైరెక్షన్ చేస్తానని చెబుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నివేథా, కెరీర్ ప్రారంభంలో సిస్టర్ క్యారెక్టర్స్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్‌గా మారి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనే రేంజ్‌లో అవకాశాలు అందుకుంటోంది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్‌’లో కీలక పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకుంది. ఇలా సినిమాలు చేస్తూనే మధ్యలో డైరెక్షన్ కోర్సు కూడా పూర్తి చేసిందట. అందుకే భవిష్యత్తులో కచ్చితంగా దర్శకత్వం వహిస్తానని చెబుతోంది. ముందుకుగా కొన్ని షార్ట్ ఫిలింస్ చేసి, ఆ తర్వాత సినిమాలకి దర్శకత్వం వహించనున్నట్టు తెలిపింది. చూడాలి మరి ఈ యంగ్ హీరోయిన్ డైరెక్టర్‌గా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో.