కేరళలో ‘నోరో’ వైరస్‌ కలవరం

ఇప్పటికే కరోనా వైరస్ వెన్నులో వణుకు పుట్టిస్తుంటే తాజాగా కేరళలో మరో వైరస్‌ కేసు నమోదు కావడం ఆ రాష్ట్రాన్ని కలవరం పెడుతోంది. తాజాగా వాయనాడ్‌ జిల్లాలో నోరో వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. వివరాల ప్రకారం.. వాయనాడ్ జిల్లాలోని వైత్తిరి సమీపంలోని పూకోడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులకు అరుదైన నోరోవైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. జంతువుల ద్వారా సంక్రమించే నోరో వైరస్, కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుందని చెప్పారు. వ్యాధి నియంత్రణకు మార్గదర్శకాలను జారీ చేశారు. ‘సరైన నివారణ, చికిత్సతో నోరో వైరస్‌ వ్యాధి త్వరగా నయమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాధి, దాని నివారణ మార్గాల గురించి తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.