చిలగడ దుంప క్యాన్సర్‌ నిరోధిస్తుందా?

చిలకడ దుంప.. ఈ తియ్యని దుంపను ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. నోటిలో పెట్టుకోగానే.. తియ్యగా కరిగిపోయే ఈ దుంపలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఇందులో పిండి పదార్థాలతోపాటు చక్కెర శాతంగా కూడా ఎక్కువే. ఈ దుంప శరీరానికి బోలెడన్ని పోషకాలను అందించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం హృదయ స్పందనలు, నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిర్ల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా ఏయే ప్రయోజనాలు కలుగుతాయో చూద్దామా!

 ఇందులోని విటమిన్-A క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తుంది.
అతినీలలోహిత కిరణాల వలన కలిగే ప్రమాదాల నుంచి చిలకడ దుంప రక్షణ కల్పిస్తుంది.
శరీరానికి శక్తి, ఎముకల ఆరోగ్యాన్ని కూడా కాపాడటంలో ఈ దుంప తర్వాతే ఏదైనా.
ఇందులోని విటమిన్-C జలుబు, ఫ్లూ రోగాలను తగ్గిస్తుంది.
దంతాలు ఆరోగ్యానికి, రక్త కణాల, కొలేజన్లు ఉత్పత్తి పెంచేందుకు తోడ్పడుతుంది.
కొలేజన్లు చర్మ కణాలకు స్టితిస్థాపకతను చేకూర్చి ఒత్తిడి, క్యాన్సర్ వ్యాధిని దరిచేరకుండా అడ్డుకుంటాయి.
చిలగడ దుంపలోని ఫైబర్ జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్‌లు, అసిడిటీ, మలబద్దకాన్ని నివారిస్తాయి.
అల్ట్రావైలెట్ రేస్ వల్ల ప్రమాదానికి గురైన కణాలను భర్తీ చేయడానికి చిలకడ దుంపలోని విటమిన్-A తోడ్పడుతుంది.
రక్తంలోని ఎర్ర, తెల్ల రక్తకణాలను అధికంగా ఉత్పత్తి చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది.
చిలకడ దుంప మానసిక ఆందోళనలు తగ్గించేందుకు తోడ్పడుతుంది.
చిలగడ దుంపలో విటమిన్-D కూడా ఎక్కువే.