‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’గా నిహారిక వెబ్‌ సిరీస్‌

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్‌ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుదలైంది. నిహారిక కొనిదెల నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ని మహేష్ ఉప్పాల డైరెక్ట్ చేస్తున్నాడు. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో సీనియర్ హీరో నరేష్, సీనియర్ నటి తులసి, గెటప్ శ్రీను తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 

ఒక గమ్యం, లక్ష్యం లేకుండా లేజీగా బతికేస్తున్న ఓ యువకుడిపై అనుకోకుండా మొత్తం కుటుంబభారంతో పాటు తండ్రి చేసిన అప్పు వల్ల వచ్చిన ఆర్థిక భారం కూడా పడితే ఎలా ఉంటుంది ? ఆ ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు అసరమైన ఈజీ మనీ కోసం ఆ యువకుడు ఎలాంటి మార్గం ఎంచుకున్నాడు ? ఏం చేశాడనేదే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కథనం.