Oscar విజేతలు వీరే..!

అత్యంత ప్రతిష్టాతక 93వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. కోవిడ్‌ కారణంగా గతేడాది నుంచి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ వేడుక ఎట్టకేలకు మొదలైంది. ఈ కారణంగా మొట్టమొదటిసారి ఈ వేడుకను రెండు ప్రాంతాల్లో నిర్వహిస్తుండటం గమనార్హం. అయితే ఈ వేడుకకు కేవలం సెలబ్రిటీలు మాత్రమే హాజరుకానున్నారు. ఈ అవార్డుల్లో దివంగత బాలీవుడ్‌ నటులు ఇర్ఫాన్‌ఖాన్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ భాను అధియాలకు మొదటి భారతీయ ఆస్కార్‌ అవార్డు దక్కింది. గత ఏడాది క్యాన్సర్‌తో ఇర్ఫాన్‌ ఖాన్‌ చనిపోగా…భాను అథియా అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నోమ్యాడ్‌ ల్యాండ్‌ నిలిచింది. ఉత్తమ దర్శకురాలిగా క్లోవే జావో నిలిచారు.

ఉత్తమ చిత్రం: నోమ్యాడ్‌ ల్యాండ్‌
ఉత్తమ దర్శకురాలు : క్లోవీ జావో (నోమ్యాడ్‌ ల్యాండ్‌)
ఉత్తమ నటి: ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్మెండ్‌ (నో మ్యాండ్‌ ల్యాండ్‌)
ఉత్తమ నటుడు: ఆంథోని హాప్కిన్స్‌(ది ఫాదర్‌)
ఉత్తమ సహాయ నటుడు: డానియెల్‌ కలువోయా (జుడాస్‌ అండ్‌ ది బ్లాక్‌ మిస్సయా)
ఉత్తమ సహాయ నటి: యున్‌ యా జంగ్‌ (మినారి)
ఉత్తమ సౌండ్‌: సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌
ఉత్తమ సినిమాటోగ్రఫి: ఎరిక్‌ (మ్యాంక్‌)
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఎమరాల్డ్‌ ఫెన్నెల్‌ (ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌)
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: క్రిస్టోఫర్‌ హామ్టన్‌, ఫ్లొరియన్‌ జెల్లర్‌ (ది ఫాదర్‌)
ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: అనదర్‌ రౌండ్‌ (డెన్మార్క్‌)
ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: సెర్హియోలోఫెజ్‌, మియానీల్‌, జమికా విల్సన్‌ (మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)
ఉత్తమ క్యాస్టూమ్‌ డిజైన్‌: అన్‌రాత్‌ (మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)
ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: మార్టిన్‌ డెస్మండ్‌ రారు (టూ డిస్టెంట్‌ స్ట్రేంజర్స్‌)
ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: మైకల్‌ గ్రోవియర్‌ (ఇఫ్‌ ఎనిథింగ్‌ హ్యాపెన్స్‌ ఐ లవ్‌ యూ)
ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పీట్‌ డాక్టర్‌, దానా మరీ (సోల్‌)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌: అంథోనీ (కలెక్టివ్‌)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: పిపా, జేమ్స్‌ రీడ్‌, క్రేగ్‌ ఫాస్టర్‌ (మై ఆక్టోపస్‌ టీచర్‌)
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: ఆండ్రూ జాక్సన్‌, డేవిడ్‌ లీ (టెనెట్‌)
ఉత్తమ ప్రొడెక్షన్‌ డిజైన్‌: డోనాల్డ్‌ బర్ట్‌ (మ్యాంక్‌)