వెండితెరపై అపర చాణక్యుడి జీవితం

బహుభాషా కోవిదుడు, భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు బయోపిక్‌ వెండితెరపైకి రాబోతోంది. ఈ బయోపిక్‌ను ‘ఎన్టీఆర్‌ ఫిల్మ్స్‌’ పతాకంపై రూపొందించనున్నారు. గతంలో ‘శ్రీశైలం’ చిత్రాన్ని నిర్మించిన తాడివాక రమేష్‌ నాయుడు ఈ బయోపిక్‌కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సీనియర్‌ దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. తెలుగు, హిందీ భాషలతోపాటు మరికొన్ని ముఖ్య భారతీయ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రంలో జాతీయస్థాయిలో ప్రముఖ నటుడు పివి నరసింహరావు పాత్రను పోషించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌వర్క్‌ పూర్తయి, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలో సెట్స్‌ మీదకు రానున్న ఈ చిత్రాన్ని 2022, జూన్‌ 28న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.