నవంబర్‌ 29 నుండి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

నవంబర్ చివరి వారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సారి సమావేశాల్లో పలు బిల్లులను ఆమోదించనున్నారు. ఆర్థిక రంగానికి చెందిన రెండు కీలకమైన బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (PFRDA) చ‌ట్టం-2013 స‌వ‌ర‌ణ బిల్లు, దీంతో పాటు బ్యాంకింగ్ రెగ్యులేష‌న్ చ‌ట్టం-1949 స‌వ‌ర‌ణ బిల్లు ను ఈ సమావేశాల్లో ఆమోదింపజేసుకోనున్నారు. అటు సమావేశాల షెడ్యూల్ విడుదల కావటంతో ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యాయి.