చిరంజీవి కొత్త సినిమాపై పవన్ కళ్యాణ్ క్లియర్ హింట్

చిరంజీవి- మెహర్ రమేష్ మూవీ కన్ఫర్మ్. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్లుగా చెక్కర్లు కొడుతున్న వార్త. దానికి కారణం చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణే. గత నెల రోజుల నుంచే నుంచే మెహర్ రమేష్- చిరంజీవి కాంబోలో కొత్త సినిమా రానుందనే వార్తలు వస్తున్నాయి కానీ అది ఎంతవరకు సాధ్యపడొచ్చు అనే కోణంలో చర్చించుకున్నారు జనం. అయితే తాజాగా ఆ చర్చలకు ఫుల్‌స్టాప్ పెట్టేలా వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతోందని క్లియర్ హింట్ ఇచ్చారు పవర్ స్టార్ కాస్త గ్యాప్ తీసుకొని తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. కుర్ర హీరోలకు ధీటుగా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ మూవీ చేస్తున్న ఆయన ఆ తర్వాత లూసిఫర్ రీమేక్‌లో నటించనున్నారు. ఇక ఆ వెంటనే మెహర్ రమేష్‌తో చిరంజీవి సినిమా పట్టాలెక్కనుందని వార్తలు విన్నాం. కాకపోతే ఓ ఫ్లాప్ డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ అనేసరికి ఎవ్వరికీ నమ్మశక్యం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ చేసిన ట్వీట్‌తో చిరంజీవి- మెహర్ రమేష్ మూవీ కన్ఫర్మ్ అని తేలిపోయింది.