డిప్రెషన్‌లో ఎన్టీఆర్ హీరోయిన్

తాజాగా తాను డిప్రెషన్‌లో ఉన్నానంటూ ప్రముఖ హీరోయిన్ తెలిపింది. టాలీవుడ్ లో ‘ప్రయాణం’, ‘ఊసరవెల్లి’ సినిమాలతో పేరు తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ ఘోష్ తాను డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఈ విషయమై పోస్ట్ పెట్టిన ఆమె గత ఐదేళ్లుగా డిప్రెషన్ తో ఇబ్బందిపడుతూ మెడిసన్స్ తీసుకుంటున్నానని చెప్పింది. అలాగే తనకు పానిక్ ఎటాక్స్ వచ్చినప్పుడు తన స్నేహితులకు, ఫ్యామిలీ మెంబర్స్ కు ఫోన్ చేసి సాయం కోరుతానని, డిప్రెషన్ నుంచి బయిటపడతానని అన్నారు.