ప్రోటీన్ల లిస్ట్ లో నెంబర్ వన్ స్ధానం దీనిదే…

వేరుశెన‌గ‌లు… అంటే పల్లీలు…వీటి గురించి తెలియని వారుండరు. నేల లోపల కాస్తాయి కాబట్టి వీటిని గ్రౌండ్‌నట్స్‌ అనీ అంటారు. ఎలా పిలిచినా స‌రే.. వేరుశనగలు బలమైన ఆహారం. వీటిల్లో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. అవ‌న్నీ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మే. ప‌ల్లీల‌తో చాలా మంది అనేక ర‌కాల వంట‌లు చేసుకుంటూ ఉంటారు.

ప్రతిరోజు పల్లీలు తినడం వల్ల క్యాన్సర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. వీటిలో ఫాలీ ఫినోలిక్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా చూస్తాయి. కార్సినోజెనిక్ ప‌దార్థాల‌ను శ‌రీరం నుంచి బ‌య‌ట‌కు పంపుతాయి. వీటిని త‌ర‌చూ తినడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా త‌గ్గుతాయి. వీటిని తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది. వీటిలో మోనో అన్ శాచురేటుడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తాయి. మరియు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఈ క్ర‌మంలో అధిక బ‌రువు కూడా తగ్గుతారు. అలాగే శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి.