ఏపీలో థియేటర్లకు అనుమతి

కరోనా వల్ల మూతపడ్డ థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50 శాతం సీటింగ్‌తో జులై 8వ తేదీ నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చని పేర్కొంది. ఓ వైపు లాక్‌డౌన్‌ కారణంగా చాలా సినిమాలు చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్‌లు, నిర్మాణానంతర పనులు జోరందుకుంటున్నాయి. తాజాగా ఎపిలో థియేటర్లకు అనుమతి రావడంతో దర్శక, నిర్మాతలు తమ సినిమా విడుదల తేదీలపై సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇచ్చినా.. ఎప్పటి నుంచి ప్రదర్శనలు మొదలు పెట్టాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు తెలుగు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌లో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్ణయించింది. ఈ నెల 7న హైదరాబాద్‌లోని తెలుగు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ రామానాయుడు బిల్డింగ్‌లో ఈ సమావేశం జరగనుంది.