కృష్ణా జిల్లాలో హత్యకు గురైన వైసీపీ నేత, మాజీ మార్కెట్‌యార్డ్ ఛైర్మన్ మోకా భాస్కర్‌రావు భౌతికకాయాన్ని మంత్రి పేర్ని నాని సందర్శించారు. భాస్కర్‌రావు భౌతికకాయాన్ని చూడగానే మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. భాస్కర్ రావు మంత్రి పేర్ని నానికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. భాస్కర్‌రావు హత్యకు గురయ్యారనే విషయం తెలియగానే నాని హుటాహుటిన మచిలీపట్నం చేరుకున్నారు. భాస్కర్ రావుపై మచిలీపట్నంలో ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను ఆసుపత్రికి తరలించగా అక్కడ చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్ని అనే వ్యక్తిని అనుమానితుడిగా భావిస్తున్నారు..
