పవన్ కల్యాణ్ ఎలాంటివాడో కాపులకు ఇవాళ అర్థమైంది: పేర్ని నాని

టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలను పవన్ కల్యాణ్ అంగీకరించడం పట్ల వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు.సీట్ల పంపకంపై పవన్ చెబుతున్న లెక్కలు చూస్తుంటే మంగళవారం సామెతను తలపిస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు తన కులానికి 21 సీట్లు ప్రకటించుకున్నారని, కాపులకు మరీ హీనంగా 7 సీట్లు ప్రకటించారని విమర్శించారు.

చంద్రబాబు శ్రేయస్సు కోసమే రాజకీయాలు చేసే పవన్ కల్యాణ్ 24 సీట్లతో కాపులకు రాజ్యాధికారం అందిస్తాడా? పవన్ కల్యాణ్ ఎలాంటివాడో కాపులకు ఇవాళ అర్థమైంది… ఇన్నాళ్లూ మమ్మల్ని విమర్శించిన వాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు? అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇక, పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబే నిర్ణయిస్తారని అన్నారు.