హెబ్బా పటేల్ కి బదులుగా తమన్నా..

2022 ఓటీటీలో విడుదలైన సంచలన విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఓదెల రైల్వే స్టేషన్’. అశోక్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ప్రధాన పాత్రలో నటించగా ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ‘ఓదెల 2’ రాబోతుంది. అయితే ఈ సారి హెబ్బా పటేల్ ని పక్కన పెట్టి తమన్నాని మెయిన్ లీడ్ లోకి తీసుకున్నారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లింగ్ సబ్జెక్టుతో రాబోతున్నారు మూవీ యూనిట్. ఈ సీక్వెల్ లో హెబ్బా పటేల్ కూడా ఉంటుంది కానీ మెయిన్ లీడ్ మాత్రం ఈ సారి తమన్నా అని తెలుస్తుంది.

అయితే ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. కాగా కాశీలో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అయితే ఇక ఇప్పటి వరకు ఈ మూవీ నుండి ఎలాంటి అప్ డేట్ రివీల్ చేయనపటికి, తాజాగా చిత్రీకరణ చేస్తున్న సమయంలోని కొనీ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాగా … ఆ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా ఈ ఫోటోలలో తమన్నా చూట్టు అగోరాల మధ్యలో కూర్చుని.. చీర కట్టు బొట్టుతో ఎంతో పద్ధతిగా కనపడింది. చూస్తుంటే మూవీని గట్టిగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.