తౌక్టే తుఫాన్‌కు ప్రభావితమైన గుజరాత్లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే బుధవారం చేపట్టారు. తొలుత రాష్ట్రంలోని భావనగర్‌కు చేరుకున్న అనంతరం విమానంలో తుఫాన్ బాధిత ప్రాంతాలైన ఉణ, డయ్యు జఫ్రాబాద్, మహువలను విహంగ వీక్షణం చేశారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీని తర్వాత అధికారులతో అహ్మదాబాద్‌లో మోడీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తౌక్టే తుపాన్ కారణంగా గుజరాత్లో 13 మంది మరణించిన సంగతి విదితమే.
