మోదీ వీడియో కాన్ఫరెన్స్.

మోదీ వీడియో కాన్ఫరెన్స్.. లాక్‌డౌన్‌పై మే 3 తరువాతే నిర్ణయం

మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో ప్రస్తుతం రెండో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. మొదటి దశ మార్చి 24న ప్రారంభమై ఏప్రిల్ 14న ముగిసింది. రెండోదశ లాక్‌డౌన్ మే 3న ముగియనుంది. ఈ నేఫథ్యంలో కరోనా కట్టడికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటోన్న చర్యలను ప్రధాని సమీక్షించారు.

లాక్‌డౌన్‌పై మే 3వ తేదీ తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రధాని.. సీఎంలతో అన్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్‌డౌన్‌ కొనసాగుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. కరోనా ప్రభావం తక్కువున్న రాష్ట్రాల్లో, జిల్లాల వారిగా సమీక్షిస్తామని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందవద్దని సీఎంలతో అన్నట్లు తెలిసింది. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని సీఎంలతో మోదీ పేర్కొన్నారు.