KCR, బండి సంజయ్‌లపై పొన్నం ప్రభాకర్ ఫైర్

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ సీఎం కేసీఆర్‌లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ..ఎంపీగా ఐదు సంవత్సరాలు ఉండి ప్రజా సమస్యలు పట్టించుకోని బండి సంజయ్‌కి, నాలుగు నెలల పాటు ఉలుకు పలుకు లేకుండా ఇప్పుడు పొలాల బాట పట్టిన కేసిఆర్ ఈరోజు రైతుల దగ్గర ముసలి కన్నీరు కారుస్తూ డ్రామాలకు తెరలేపారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

కేసిఆర్, బండి సంజయ్ ఇద్దరూ కూడా ఇక్కడ దీక్ష చేసే బదులు ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలోని రైతులకు ఇబ్బంది కలగకుండా నరేంద్ర మోడీ దగ్గర దీక్ష చేయాలని హితవు పలికారు. విభజన హామీలు అమలు చేయని, తెలంగాణ విభజనను వ్యతిరేకించిన నరేంద్ర మోడీ దగ్గర ధర్నా చేసి కేంద్రం దగ్గర నిధులు తీసుకురావాలన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం మొన్నటి దాకా రాముడు ఫోటో పెట్టుకుని నరేంద్ర మోడీ ఫోటో బంద్ చేశారని ఎద్దేవా చేశారు.