Ap film corporation development chairman posani

ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా పోసాని బాధ్యతలు.. జగన్ గురించి ఏం మాట్లాడాడో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పోసాని కృష్ణ మురళి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పోసాని అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు.

ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పోసాని కృష్ణ మురళి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పోసాని అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల సమయంలో పోసాని వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా పోసాని కృష్ణ మురళీ పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం.. ఆయన మాట్లాడుతూ పదవికోసం రాజకీయాల్లోకి రాలేదని, జగన్‌ని దూరం నుంచి చూసి వచ్చానని తెలిపారు. చచ్చే వరకు జగన్‌తోనే ఉంటానని, వైసీపీ జెండామోస్తానని పోసానీ తెలిపారు.

ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పోసాని కృష్ణ మురళిని పలువురు అభినందించారు. ఆయన నేతృత్వంలో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ అభివృద్ధి చెందాలని వైసీపీ నేతలు ఆకాంక్షను వ్యక్తం చేశారు. పోసాని సారథ్యంలో సందేశాత్మక చిత్రాల లేమి తొలగిపోవాలని పేర్నినాని ఆశాభావం వ్యక్తం చేశారు.