విదేశాల్లో ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదుగా..!

విదేశీ మీడియాలో మన నటుల గురించి వార్తలు రావడం చాలా అరుదు. హాలీవుడ్‌ సినిమా హీరోలను మాత్రమే తమ మీడియాలో కవర్‌ చేసే ఇటలీ మీడియా సంస్థ ఇటీవల ప్రభాస్‌ గురించి ఓ వార్తా కథనం రాసింది. ప్రభాస్‌ ‘రాధే శ్యామ్‌’ సినిమా షూటింగ్‌ ముగించుకుని ఇటలీ నుంచి ఇండియాకు తిరిగి వెళ్లి పోయాడు అంటూ ఇటాలియన్‌ వెబ్‌ పోర్టల్‌ కథనం రాసింది. దాంతో ప్రస్తుతం ఆ వార్తను ప్రభాస్‌ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు.